Swayambhu: స్వయంభు టీజర్ వచ్చేసింది.. నిఖిల్ కి పాన్ ఇండియా హిట్ ఖాయమా!
on Feb 11, 2026

-సోషల్ మీడియాని షేక్ చేస్తున్న స్వయంభు
-టీజర్ లో ఉన్న స్పెషల్ ఏంటి!
-కథ ఏంటో తెలిసిపోయిందా!
కార్తికేయ పార్ట్ 2 తో పాన్ ఇండియా స్టార్ గా తన స్థాయిని పెంచుకున్న నిఖిల్(Nikhil Siddartha)నుంచి ఆ తర్వాత వచ్చిన చిత్రాలేవీ పెద్దగా అలరించలేదు. దీంతో ఈ సారి 'స్వయంభు' (Swayambhu)అనే పీరియాడిక్ యాక్షన్ మూవీతో పాన్ ఇండియా స్టార్ టాగ్ లైన్ తన నుంచి వెళ్లకుండా ఉండాలనే పట్టుదలతో ఉన్నాడు. తన పట్టుదల నిజమయ్యే సూచనలు కొద్దీ సేపటి క్రితం విడుదలైన స్వయంభు టీజర్ తో తెలుస్తుంది. మరి సదరు టీజర్ విశేషాలు చూద్దాం.
సుమారు రెండు నిమిషాల నిడివితో వచ్చిన టీజర్ లో 'శ్రీరాముడికి పరమేశ్వరుడు ప్రసాదించిన సింగోలు కి కూడా అరణ్య వాసమా అని ఒక క్యారక్టర్ సదరు సింగోలు ఆయుధాన్ని చూపించడంతో టీజర్ ప్రారంభమైంది. దీంతో శ్రీరాముడు ఆయుధమైన సింగోలు నేపథ్యంలో కథ నడవబోతుందని అనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని క్యారెక్టర్స్ పై వచ్చిన డైలాగ్స్, సన్నివేశాల రూపకల్పనలు కూడా సదరు విషయానికి బలాన్ని చేకూర్చుతున్నాయి. పోరాటసన్నివేశాలని కూడా చూస్తుంటే మేకర్స్ ముందు నుంచి చెప్తునట్టుగా నిఖిల్ పోరాట యోధుడు గా చేస్తున్నాడని అర్ధమవుతుంది. ఈ సందర్భంగా నిఖిల్ క్యారక్టర్ నుంచి వచ్చిన మాటలు కూడా సినిమాపై అంచనాలని పెంచేసాయి. సంయుక్త మీనన్, నభా నటేష్,సునీల్, సుబ్బరాజు తో పాటు మిగతా క్యారెక్టర్స్ కూడా కథ పరిధిలో నడవనున్నాయనే విషయం అర్ధమవుతుంది.
Also read: కమల్ హాసన్ పై కస్తూరి కీలక వ్యాఖ్యలు.. మధ్యలో తెలుగోళ్లు వచ్చారు
లెజండ్రీ కెమెరామెన్ సెంథిల్(Senthil KUmar)ద్వారా విజువల్స్ పరంగా కూడా ఒక కొత్త లోకం సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యక్షం కాబోతుందని టీజర్ క్లియర్ కట్ గా చెప్తుంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా సేమ్ .ముఖ్యంగా కె జిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ అందించిన ఆర్ ఆర్ మరో లెవల్. భరత్ కృష్ణమాచారి(Bharat Krishnamachari)దర్శకత్వ ప్రతిభ. ఠాగూర్ మధు, భువన్, శ్రీకర్ నిర్మాణ విలువలపై కూడా మాట్లాడుకోడాలు లేవు. అంతలా రెండు నిమిషాల నిడివి టీజర్ తోనే మెస్మరైజ్ చేశారు.పాన్ ఇండియా అన్ని భాషల్లో ఈ వేసవికి థియేటర్స్ లో స్వయం ప్రకాశించనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



