సుధీర్ బాబు ఇలా తయారయ్యాడేంటి?
on Feb 27, 2023

టాలీవుడ్ లో ఎప్పుడూ ఫిట్ గా, కండలు తిరిగిన దేహంతో కనిపించే అతి కొద్దిమంది హీరోలలో సుధీర్ బాబు ఒకడు. అలాంటి సుధీర్ బాబు ఇప్పుడు గుర్తుపట్టలేనట్టుగా, బొద్దుగా తయారయ్యాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన తాజాగా లుక్ చూసి అభిమానులు షాకవుతున్నారు. అయితే ఆయన తన తదుపరి చిత్రం కోసం ఇలా తయారయ్యాడు.
ఇటీవల 'హంట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ప్రస్తుతం హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'మామా మశ్చీంద్ర' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఆ మూడు పాత్రల్లో ఒకదానిలో ఆయన బాగా బొద్దుగా కనిపించనున్నాడు. తాజాగా ఈ పాత్ర లుక్ కి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడూ సిక్స్ ప్యాక్ తో కనిపించే ఆయన పెద్ద పొట్టతో కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వీడియో క్లిప్ లో ఆయన ఆహార్యం, హావభావాలు అలరిస్తున్నాయి. మొదటి నుంచి తాను ఎంపిక చేసుకుంటున్న సినిమాలలో వైవిధ్యం చూపిస్తున్న సుధీర్ బాబు ఈసారి 'మామా మశ్చీంద్ర'తో అంతకమించిన వైవిధ్యం చూపించి సర్ ప్రైజ్ చేయబోతున్నాడని అర్థమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



