రోలెక్స్ రాక ఖాయం.. సూర్య క్లారిటీ.. పూనకాలే!
on Aug 14, 2023

వెర్సటైల్ హీరో సూర్య డిఫరెంట్ సినిమాలు, విలక్షణమైన పాత్రలు చేస్తూ పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం 'కంగువా' సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీని తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో 'వాడివాసల్' సినిమాను చేయాలి. కానీ డైరెక్టర్ 'విడుదలై 2' చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. అందువల్ల ఆ గ్యాప్‌లో సూర్య తన 43ను కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాను సుధా కొంగర తెరకెక్కించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఆ తర్వాత కూడా సూర్య చేసే సినిమాలపై నెట్టింట న్యూస్ వైరల్ అవుతోంది.
ఈ నేపథ్యంలో సూర్య తాను నెక్ట్స్ చేయబోయే సినిమాలపై ఓ క్లారిటీ ఇచ్చేశారు. రీసెంట్‌గా ఫ్యాన్స్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నసూర్య తన సినిమాలకు సంబంధించి వివరణను ఇచ్చారు. "కంగువా సినిమా అనుకున్న దాని కంటే చాలా బాగా వస్తుంది. త్వరలోనే దాన్ని పూర్తి చేసి నా 43వ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో 'వాడివాసల్' మూవీ ఉంటుంది. ఆయన ఇప్పుడు 'విడుదలై 2' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. లోకేష్ కనకరాజ్ కూడా రోలెక్స్ కథను చెప్పారు. నాకు నచ్చింది. అది కూడా త్వరలోనే ప్రారంభం అవుతుంది. ఆ నెక్ట్స్ ఇరుంబు కై మాయావి సినిమా చేస్తాను" అని చెప్పుకొచ్చారు సూర్య.
సూర్య ఇప్పుడు శివ దర్శకత్వంలో చేస్తోన్న 'కంగువా' మూవీ పాన్ ఇండియా చిత్రంగా ఏకంగా పది భాషల్లో రిలీజ్ కానుంది. పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూర్య వారియర్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు సూర్య చేయనటువంటి జోనర్ మూవీ ఇది. దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు సహా అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



