సేమ్ మంత్ - సేమ్ ఓటీటీ అంటున్న సూర్య!
on Aug 5, 2021
కోలీవుడ్ స్టార్ సూర్యని మళ్ళీ ఫామ్ లోకి తీసుకువచ్చిన చిత్రం `సూరరై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా`). గత ఏడాది దీపావళి స్పెషల్ గా నవంబర్ 12న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిందీ సినిమా. కట్ చేస్తే.. సంవత్సరం తరువాత మరోసారి అదే ఓటీటీలో అదే నెలలో తన కొత్త చిత్రంతో పలకరించబోతున్నాడు సూర్య. ఆ సినిమానే.. `జై భీమ్`. ఇందులో తొలిసారిగా లాయర్ వేషంలో కనిపించబోతున్నాడు సూర్య.
సూర్య బర్త్ డే స్పెషల్ గా `జై భీమ్` ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. కట్ చేస్తే.. ఈ రోజు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోందంటూ అనౌన్స్ చేశాడు సూర్య. అంతేకాదు.. తమ 2డి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుండి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు నాలుగు నెలలపాటు నెలకో సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోందంటూ ఆయా చిత్రాల వివరాలను ప్రకటించాడు కూడా. సెప్టెంబర్ లో `రామే ఆండాలుమ్ రావణే ఆండాలుమ్`, అక్టోబర్ లో `ఉడన్ పిరప్పే`, నవంబర్ లో `జై భీమ్`, డిసెంబర్ లో `ఓ మై డాగ్`.. ఇలా సూర్య నిర్మాణంలో తయారైన చిత్రాలు అమెజాన్ లో వరుస నెలల్లో స్ట్రీమ్ కాబోతున్నాయి. అయితే, వీటిలో అందరి దృష్టి `జై భీమ్`పైనే ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం తమిళంకే పరిమితం కాకుండా తెలుగుతో సహా పలుభాషల్లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది.
మరి.. సేమ్ మంత్ - సేమ్ ఓటీటీ అంటున్న సూర్య.. మరోసారి తన అభినయంతో మురిపిస్తాడేమో చూడాలి.
Also Read