సూర్య ఇస్లాం మతాన్ని స్వీకరించాడా? నిజమేనా?
on Mar 28, 2017

తమిళంలో ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగు ప్రేక్షకులకి అంతే సుపరిచితుడు హీరో సూర్య. గజినీతో తెలుగు సినిమాపై దండ యాత్ర మొదలెట్టిన సూర్య, అనతి కాలంలోనే తెలుగు స్టార్ హీరోలకి సమానంగా ఇక్కడ మార్కెట్ సంపాదించుకున్నాడు. సింగం సిరీస్ అయితే, సూర్య ఖ్యాతిని అమాంతం పెంచేసింది. అసలు విషయానికి వస్తే, సూర్య ఇస్లాం మతాన్ని స్వీకరించాడని వదంతులు వినిపిస్తున్నాయి. సూర్య కడప దర్గాలో ఉన్న ఫోటోలు నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.
కానీ, సూర్య సన్నిహితులు ఈ విషయాన్నీ ఖండిస్తున్నారు. సూర్య ఇస్లాం మతంలో చేరుతున్నాడు అనేవి వట్టి పుకార్లు. పైగా నెట్లో కనిపించిన ఫోటో కానీ వీడియో కానీ చాలా పాతది. సింగం 2 షూట్ చేస్తున్నప్పుడు, ఏ ఆర్ రెహ్మాన్ కోరిక మేరకు సూర్య కడప దర్గాకు వెళ్లారు. అప్పుడు తీసిన ఫోటోలు అవి. అంతే కానీ ఆయనకి ఇస్లాం మతంలో చేరే ఉద్దేశ్యం ఏమాత్రం లేదు, అని వివరణ ఇచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



