పవన్ కళ్యాణ్ కి వంద ముద్దులిస్తా: సురేఖ వాణి
on May 12, 2021

క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీ తో సరదగా’ ప్రోగ్రామ్ కు అతిధిగా వచ్చిన సురేఖ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హీరోల్లో తను చిరంజీవికి పెద్ద అభిమానినని, ఆయన్ను చూసినప్పుడల్లా తన కళ్లల్లో నీళ్లు తిరుగుతాయని చెప్పారు. అలా ఒకరోజు ఏడుస్తుంటే చిరంజీవి ఓదార్చారని, ఆ తర్వాత ఒకరోజు వాళ్ల ఇంటికి భోజనానికి కూడా ఆహ్వానించారని తెలిపారు. అలాగే ఆ షోలో అలీ అడిగిన ఓ కొంటె ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది. హీరోల్లో ఎవరికైనా వంద ముద్దులు ఇవ్వాలనుకుంటే ఎవరికిస్తారని అలీ అడగ్గా.. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు.
కాగా, ఈ షోలో సురేఖ వాణి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా పంచుకున్నారు. తన భర్త చనిపోయాక అత్తింటివారి వేధింపులు తట్టుకొలేక బయటక వచ్చానంటూ భావోద్యేగానికి గురయ్యారు. అలాగే తన కూతురు సుప్రీయ నటనతో శిక్షణ తీసుకుంటుందని, సినిమాల్లో రావడమనేది పూర్తిగా ఆమె ఇష్టంపై ఆధారపడి ఉందన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



