సన్నీ లియోన్ ‘కామసూత్ర’?
on Sep 25, 2019
రెడియో మిర్చి కంటే సన్నీ లియోన్‌కి ‘ఇది చాలా హాటు గురూ’ కాప్షన్ బాగా సూటవుతుందేమో! హిందీలో సన్నీ లియోన్ నటించిన సినిమాలకు పెద్దలకు మాత్రమే అని సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చింది. హిందీ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు సెన్సార్ చేయలేని సినిమాలు చాలా అంటే చాలా చేశారామె. నీలి చిత్రాల నటిగా, శృంగార తారగా సన్నీకి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. వాత్సాయనుడు ‘కామసూత్ర’ రాస్తే... పోర్న్ ఇండస్ట్రీలో ‘కామసూత్ర’కు తీసిపోని సినిమాలు చేశారు. ఇప్పుడు ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే... సన్నీ లియోన్ ముఖ్య తారగా వాత్సాయనుడి కామసూత్ర ఆధారంగా హాట్ హిందీ సినిమాల నిర్మాత ఏక్తా కపూర్ ఓ వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నారని ముంబై టాక్. కామసూత్ర బుక్ బేస్ చేసుకుని గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ, సన్నీ చేస్తుండటం స్పెషల్. గతంలో సన్నీతో ‘రాగిణి ఎంఎంఎస్ 2’ సినిమా నిర్మించారు ఏక్తా కపూర్. విమర్శలను వదిలేస్తే... ఆ సినిమా వసూళ్లలో సంచలనాలు సృష్టించింది. ఈ ‘కామసూత్ర’ వెబ్ సిరీస్ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో?