ఇదంతా సుకుమార్,దేవీశ్రీ వల్లే..!!
on Jul 21, 2018
హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం రంగస్థలం.ఈ చిత్రంలో హైలెట్‌గా నిలిచింది ‘జిల్.. జిల్.. జిగేల్ రాణి’ సాంగ్. ఈ పాట పాడింది గంటా వెంకట లక్ష్మి అనే మహిళ. కొద్దిరోజులుగా వెంకటలక్ష్మి మీడియాలో పాట పాడినందుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని,తనను తీసుకెళ్లిన మధ్యవర్తి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రసార మాధ్యమాల్లో ఆమె ఆవేదన వైరల్ గా మారింది.

ఈ వార్తలు చూసిన దర్శకుడు సుకుమార్ స్పందించారు. ఆమెకు లక్ష రూపాయలు పంపారు.దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు సుకుమార్,సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ పాట పాడే అవకాశం ఇచ్చారని ఆమె చెప్పారు.సుకుమార్ పంపిన లక్ష రూపాయలు తనకు అందాయని ఆమె స్పష్టం చేశారు,వారికెప్పుడు రుణపడి ఉంటానని తెలిపింది.సినిమాల్లో ప్రతిభ గల తన లాంటి వారిని ఆదరించాలని.. పాడేందుకు అవకాశం ఇవ్వాలని వెంకటలక్ష్మీ కోరారు.ఇక జిగేల్ రాణి పాట హిట్ తో తనను ముగ్గురు దర్శక నిర్మాతలు సంప్రదించారని.. వారి సినిమాల్లో పాడే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని వెంకట లక్ష్మి తెలిపారు. ఇదంతా సుకుమార్ - దేవీశ్రీ వల్లేనని ఆమె చెప్పుకొచ్చారు. ఏదైతేనేం సుకుమార్ తన గొప్ప మనసును చాటుకున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



