హీరో పేరే... సినిమా పేరు
on Feb 6, 2020
యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా టైటిల్ మారిందని సమాచారం. మొదట ఈ సినిమాకు 'ఫైటర్' టైటిల్ అనుకున్నారు. ఆల్రెడీ తమిళంలో ఫైటర్ టైటిల్ తో శివ కార్తికేయన్ ఒక సినిమా చేశాడు. మరో భాషలోనూ 'ఫైటర్' టైటిల్ దొరకలేదు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియన్ సినిమాగా తీస్తున్నారు పూరి జగన్నాథ్. అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉంటే బావుంటుందని ఫైటర్ కాకుండా మరో టైటిల్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు సినిమాకు 'Liger' టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. అన్నట్టు సినిమాలో హీరో పేరు కూడా అదే. త్వరలో ఈ టైటిల్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమా ముంబై షెడ్యూల్ పూర్తి అయ్యింది. 'వరల్డ్ ఫేమస్ లవర్' విడుదలైన తర్వాత మళ్లీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు.