తెలంగాణ సీఎంగా హీరో శ్రీకాంత్!!!
on Oct 30, 2018
అవును శ్రీకాంత్ తెలంగాణా ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఎప్పుడు? ఎలా? అనే కదా మీ సందేహం. రియల్ లైఫ్ లో కాదులెండి. రీల్ లైఫ్ లో సిఎమ్ కాబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం నడుస్తోంది. మహానటితో మొదలైన ఈ పర్వం ఎన్టీఆర్, వైయస్ ఆర్ బయోపిక్ లతో వేగం పుంజుకుంది. లేటెస్ట్ గా కేసీఆర్ లైఫ్ హిస్టరీ పై ఒక బయోపిక్ రానుంది. ఈ బయోపిక్ లో కేసీఆర్ గా శ్రీకాంత్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఉద్యమ నేపథ్యం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎదిగిన వైనాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రానికి `తెలంగాణ దేవుడు` అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. మొదట కేసీఆర్ పాత్రలో నవాజద్దీన్ ని తీసుకోబుతున్నారని వార్తలు వచ్చాయి ..కానీ ఆ వార్తలను నవాజుద్దీన్ సిద్దిఖీ ఇటీవల ఆ వార్తల్లో వాస్తవం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు.దీంతో ఇప్పుడు శ్రీకాంత్ పేరు తెరపైకి వచ్చింది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే కేసీఆర్ పై `ఉద్యమ సింహం` అనే ఓ బయోపిక్ నిర్మితమవుతోంది. కేసీఆర్ గా ఈ చిత్రంలో నాజర్ నటిస్తున్నాడు.