బాలకృష్ణతో శ్రీకాంత్ ఢీ అంటే ఢీ
on Dec 14, 2019
నటసింహం నందమూరి బాలకృష్ణతో శ్రీకాంత్ ఢీ అంటే ఢీ అంటూ తలపడబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.'శ్రీరామరాజ్యం'లో బాలకృష్ణకు తమ్ముడిగా, లక్ష్మణుడి పాత్రలో నటించిన శ్రీకాంత్... ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో ప్రతినాయకుడిగా కనిపిస్తారని టాక్. ఆల్రెడీ శ్రీకాంత్ సినిమాకు సంతకం చేశారట. స్పెషల్ మేకోవర్ కూడా అవుతున్నట్టు సమాచారం. 'లెజెండ్'తో జగపతిబాబును బోయపాటి విలన్ చేశారు. ఆ తర్వాత ఆయన కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంతకు ముందు శ్రీకాంత్ ఓ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేశారు. అదే నాగచైతన్య 'యుద్ధం శరణం'. అయితే, ఆ సినిమా ప్లాప్ కావడంతో విలన్ గా శ్రీకాంత్ ఎస్టాబ్లిష్ కాలేదు. తన సినిమాలో విలన్స్ ను బోయపాటి బాగా చూపిస్తారు. అందువల్ల, ఈ సినిమాతో శ్రీకాంత్ కి పేరు రావొచ్చు. ఇందులో హీరోయిన్ గా కేథరిన్ ను ఎంపిక చేశారట. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
