శ్రీను వైట్ల సాధించాడు..!!
on Nov 20, 2014
శ్రీనువైట్ల, రామ్ చరణ్ తేజ సినిమా ఆగిపోలేదు. త్వరలో ఈ సినిమా పట్టాలేక్కబోతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆగడు సినిమా తరువాత శ్రీను వైట్ల ప్రాజెక్ట్ ను రామ్ చరణ్ పక్కన పెట్టారని, ఇక వారిద్దరి కాంబినేషన్ డౌటేనని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఎలాగైన హిట్ కొట్టాలని కసితో వున్న శ్రీను వైట్ల మంచి సబ్జెక్టును రెడీ చేసి మెగాస్టార్ వినిపించారట. అది వెంటనే ఆయన ఓకె చేశారని, ఆ తరువాత పనులు చకచక జరిగిపోతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ కూడా వేరే ప్రాజెక్టులు ఏవీ ఓకే చేయలేదు కాబట్టి ఈ సినిమానే పట్టాలేక్కబోతుందట.