ఆస్కార్ కావాలంటున్నశ్రీలీల..తాళం వేసారా లేదా
on Feb 27, 2025
.webp)
వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న'శ్రీలీల'(Sreeleela)గత ఏడాది డిసెంబర్ లో 'పుష్ప 2'(Pushpa 2)'లోని 'కిసిక్' సాంగ్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ని సంపాదించిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ప్రస్తుతం ఆమె నితిన్ తో రాబిన్ హుడ్'(Robin Hood)అనే మూవీ చేస్తుంది.నితిన్(NIthiin)కి భీష్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుమల(venki Kudumala)దర్శకుడు కావడంతో ఈ మూవీపై నితిన్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.మార్చి 28 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
మహా శివరాత్రి సందర్భంగా చిత్ర బృందం ఒక వీడియో రిలీజ్ చెయ్యగా అందులో శ్రీలీల మాట్లాడుతు నాకు ఆస్కార్ కావాలి అనడం, ఆ తర్వాత ఒక సాంగ్ పాడటం డాన్స్ చేయడం జరగగానే సాంగ్ చాలా బాగుంది, మిగిలింది ఏమీ లేదు, బాతు డ్యాన్స్ అని శ్రీలీలని నితిన్ ఎగతాళి చెయ్యడం,రాజేంద్ర ప్రసాద్ ఏమైందని అనడం,చివర్లో నోటికి తాళం వెయ్యండని చెప్పడం ఇలా మేకర్స్ విడుదల చేసిన వీడియో సరదా,సరదాగా సాగింది.
'ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని థియేటర్లలో ఎంటర్టైనింగ్ అడ్వెంచర్ ప్రారంభం కావడానికి ఇంకా 30 రోజులు మాత్రమే ఉందని కూడా మేకర్స్ పేర్కొన్నారు.టీజర్ మరియు ప్రచార చిత్రాలు కూడా సినిమా పై అందరిలో క్యూరియాసిటీ పెంచే విధంగా ఉంది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మైమ్ గోపీ తదితరులు కీలక పాత్రలు పోషించగా మైత్రి మూవీ మేకర్స్ నితిన్ కెరీరి లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించింది.జి వి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



