మహేష్‌తో శ్రీలీల ఫోక్ సాంగ్!
on Jan 27, 2023

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్ బాబు- త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభమైంది. ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇంతలో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించింది. దాంతో గ్యాప్ వచ్చింది. నవంబర్‌లో రెండో షెడ్యూల్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ అదే సమయంలో మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ దివంగతులయ్యారు.
ఈ విధంగా ఈ చిత్రం వాయిదాలు పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ జనవరిలో ఈ చిత్రం షూటింగ్ మరలా ప్రారంభమైందని సమాచారం. కాగా ఈ చిత్రంలో అలా వైకుంఠపురంలో, అరవింద సమేత వీర రాఘవ ల తర్వాత పూజా హెగ్డే మూడోసారి త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. మరో హీరోయిన్‌గా పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీలా ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో మహేష్ బాబు- శ్రీ లీలా మధ్య ఓ ఫోక్ సాంగ్ ఉంటుందని సమాచారం. ఇది ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందని భావిస్తున్నారు.
ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ తో ఈ చిత్రం రూపొందుతోంది. గతంలో త్రివిక్రమ్ తీసిన అత్తారింటికి దారేది చిత్రంలో కాటమరాయుడా, అజ్ఞాతవాసి సినిమాలో కొడకా కోటేశ్వరరావు, అరవింద సమేతలో రెడ్డెమ్మ తల్లి అలా వైకుంఠపురంలో సిత్తరాల సిరపడు వంటి పాటలు జానపదాలను గుర్తుకు తెచ్చి ప్రేక్షకులను అలరించాయి. సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించాయి. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు తన 29వ చిత్రాన్ని రాజమౌళితో చేయనున్నారు. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి కేఎల్ నారాయణ నిర్మాత. ఇక త్రివిక్రమ్- మహేష్ ల చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ అలియాస్ చిన్న బాబు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



