స్పైడర్ ఫస్టాఫ్ రివ్యూ
on Sep 27, 2017

తమిళ స్టార్ డైరెక్టర్, టాలీవుడ్ సూపర్‌స్టార్ ఏఆర్ మురుగదాస్ కాంభినేషన్‌లో తెరకెక్కిన స్పైడర్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూశారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో దసరా కానుకగా ఇవాళ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. ఓవర్సీస్‌లోని కొన్ని ప్రాంతాల్లో స్పైడర్ సందడి నిన్న రాత్రే మొదలవ్వడంతో సినిమా విశేషాలను సోషల్ మీడియా ద్వారా తమ సన్నిహితులతో పంచుకుంటున్నారు ఆడియన్స్. సైన్స్‌ని ఉపయోగించి సమాజానికి చెడు చేస్తున్న కొంతమంది దుష్టులను అదే సైన్స్ & టెక్నాలజీ సాయంతో హీరో ఎలా ఎదుర్కొన్నాడన్నేదే స్పైడర్ కథ. ఈ సినిమాలో మహేశ్ లాంటి సూపర్‌స్టార్, భారీ సెట్టింగ్‌లు, మురుగదాస్ దర్శకుడైనప్పటికీ అసలు హీరో బలమైన స్క్రిప్టేనట. ముఖ్యంగా హీరో కంటే కూడా విలన్‌గా నటించిన సూర్య యాక్టింగ్ బాగుందని..సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ కష్టం స్క్రీన్ మీద బాగా కనిపించింది. హరీస్ జైరాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుందట. పూర్తి రివ్యూ కోసం తెలుగువన్‌ని ఫాలో అవ్వండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



