40 కోట్లకు అమ్ముడైన 'స్పై' నాన్ థియేట్రికల్ రైట్స్
on Apr 6, 2023

గతేడాది 'కార్తికేయ-2'తో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ ఈ ఏడాది మరో పాన్ ఇండియా సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'స్పై'. ఎం.జి అమర్‌నాథ్ పిక్చర్స్, రెడ్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో ఎడిటర్ గ్యారీ బి.హెచ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ చూసి ఇండస్ట్రీ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి.
నిఖిల్ నటించిన 'కార్తికేయ-2' గతేడాది విడుదలై వరల్డ్ వైడ్ గా రూ.120 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం నార్త్ లోనూ ఘన విజయం సాధించింది. దీంతో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'స్పై'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్లే కళ్ళు చెదిరేలా బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.40 కోట్లకు అమ్ముడవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అమెజాన్, స్టార్ నెట్ వర్క్ కలిసి ఈ భారీ ధరకు 'స్పై' నాన్ థియేట్రికల్ రైట్స్ ని దక్కించుకున్నాయి. ఇక ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ఈజీగా రూ.20-25 కోట్లకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో నిఖిల్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో సౌండ్ చేస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



