Spirit: 'స్పిరిట్' రికార్డు ఓటీటీ బిజినెస్.. అప్పుడే 450 కోట్లు వచ్చాయి!
on Jan 28, 2026

సంచలనాలు సృష్టిస్తున్న స్పిరిట్
రికార్డు ధరకు ఓటీటీ డీల్ క్లోజ్
ఇప్పటికే 450 కోట్ల బిజినెస్ చేసిన స్పిరిట్
ఒకరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), మరొకరు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. ఈ రెండు పేర్లు చాలవా 'స్పిరిట్'(Spirit)పై అంచనాలు ఆకాశాన్ని తాకడానికి. అందుకే ఇంతవరకు పట్టుమని పది శాతం షూటింగ్ కూడా పూర్తి కాకుండానే.. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ ఒకటిగా 'స్పిరిట్' నిలిచింది. అంతేకాదు, అప్పుడే బిజినెస్ పరంగా ఈ మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్ కావడంతో.. 'స్పిరిట్' రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా ఈ మూవీ రికార్డు ఓటీటీ డీల్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ మధ్య 'స్పిరిట్' ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ రూ.160 కోట్లకు సొంతం చేసుకున్నట్లు న్యూస్ వినిపించింది. సాధారణంగా అయితే అది మంచి డీలే అయినప్పటికీ, ప్రభాస్-సందీప్ కాంబోకి తగ్గ డీల్ కాదనే అభిప్రాయం అభిమానులలో వ్యక్తమైంది. అందుకు తగ్గట్టుగానే తాజాగా మరో సంచలన నెంబర్ తెరపైకి వచ్చింది. 'స్పిరిట్' రైట్స్ ని ఏకంగా రూ.285 కోట్లకు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందట. ఓ రకంగా ఇది రికార్డు ప్రైస్ అని చెప్పవచ్చు. (Spirit OTT Deal)

Also Read: త్రివిక్రమ్ కి హ్యాండిచ్చిన ఎన్టీఆర్!
మరోవైపు 'స్పిరిట్' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూ.170 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అంటే ఇప్పటికే ఈ సినిమా రూ.450 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఇతర ఏరియాల థియేట్రికల్ బిజినెస్, ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ వంటివి తోడైతే.. విడుదలకు ముందే 'స్పిరిట్' మేకర్స్ కళ్ళు చెదిరే ప్రాఫిట్స్ చూడటం ఖాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



