అల్లు అర్జున్ కి నిజంగానే ఆర్మీ ఉంది..అందుకే వరల్డ్ రికార్డు ఇచ్చారు
on Jul 19, 2024

అందరి హీరోలకి అభిమానులు ఉంటారు. కానీ అల్లు అర్జున్(allu arjun)కి మాత్రం ఆర్మీ ఉంటుంది. ఈ విషయం అందరికి తెలుసు. కానీ అల్లు అర్జున్ కి మాత్రమే ఎందుకు ఆర్మీ ఉంటుందనే డౌట్ అందరిలో వస్తునే ఉంటుంది. ఇప్పుడు ఆ డౌట్ కి ఫుల్ స్టాప్ పడబోతుంది. కావాలంటే మీరే చూడండి.
అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ పుష్ప 2(pushpa 2). ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక మూవీ నుంచి ఇప్పటి వరకు రెండు పాటలు బయటకి వచ్చాయి.ఒకటి పుష్ప పుష్ప అంటూ సాగే సాంగ్ కాగా, ఇంకోటి సూసేకి(sooseki)అగ్గి రవ్వమాదిరి ఉంటాడు సామి కపుల్ సాంగ్ గా కూడా పిలుచుకుంటున్నారు. మే 29 న రీలీజైన ఈ సాంగ్ ఇప్పుడు సరికొత్త రికార్డుని సృష్టించింది. యూ ట్యూబ్ లో 175 మిలియన్ల రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది. అదే విధంగా తెలుగు వర్షన్ కి సంబంధించి 100 మిలియన్ల వ్యూస్ తో స్టిల్ రన్నింగ్ లో ఉంది. దీన్ని బట్టి అల్లు అర్జున్ స్టామినా ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.

ఇక సూసే కి సాంగ్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మళయాళం మరియు బెంగాలీ భాషల్లో రిలీజ్ అయ్యింది.ఇండియా వైడ్ గా ఎంతో మంది సోషల్ మీడియా లో రీల్స్ కూడా చేస్తున్నారు. ఇక పుష్ప పార్ట్ వన్ హిట్ కావడంతో పార్ట్ టూ పై అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 6 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



