దీపిక తెగింపు-సోనాక్షి ఫైర్!
on Apr 2, 2015
.jpg)
ఏం మాట్లాడుతున్నావో అర్ధమవుతోందా? వాడే పదాలకు అర్థం తెలుసుకుని మాట్లాడితే మంచిదని బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా ఫైరైపోతోంది. ఇంతకీ ఎవరిమీద? ఎందుకు? అంటారా!
పెళ్లికి ముందు శృంగారానుభవం, వివాహేతర సంబంధం నా ఇష్టం అంటూ పొడుగుకాళ్లసుందరి 'మై ఛాయిస్' పేరిట వీడియో విడుదలచేసిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా అబ్బాయి కాకుంటే అమ్మాయితో సెక్స్ చేస్తా....మీకేంటి బాధ, అడగడానికి మీరెవరు? అంటూ దీపిక రెచ్చిపోయింది. ఓ వారంరోజులుగా నెట్లో బీభత్సమైన హడావుడి చేసిందీ వీడియో. ఇది చూసిన సోనాక్షి సిన్హా ఒంటికాలిమీద లేచింది. విమెన్ ఎంపవర్ మెంట్ అంటే మనం ఏం బట్టలు వేసుకున్నాం, ఎవరితో సెక్స్ చేస్తాం అనేది కాదు....మహిళలు ధృడంగా తయారవడం, ఉద్యోగవకాశాలు మెరుగుపర్చుకోవడం అని క్లాస్ ఇచ్చింది. దీంతో బీటౌన్ జనాలంతా సోనాక్షి అదరగొట్టావ్ అంటూనే కాస్త నేర్చుకోమ్మా దీపికమ్మా అని సలహాఇస్తున్నారు. అయినా స్టార్ డమ్ ఉంది కదా ఏం చేసినా చెల్లుతుంది, ఏం మాట్లాడినా చెల్లుతుందని ఫీలైతే...ఇలా బుక్కవడం ఖాయం అంటున్నారంతా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



