నెగటివ్ ట్రోల్స్ చేస్తే వెతికి మరీ కొడతాను!
on Dec 28, 2022

సోషల్ మీడియా బాగా పెరిగాక మీమ్స్, ట్రోల్ల్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్ చాలా ఘాటుగానే రెస్పాండ్ అయ్యాడు. బిగ్ బాస్ 4 తర్వాత మూవీస్ బాగా చేసుకుంటూ వెళ్తున్నాడు. లేటెస్ట్ గా సోహైల్ నటించిన ఫస్ట్ మూవీ "లక్కీ లక్ష్మణ్" డిసెంబర్ 30న రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ కూడా జరిగింది. ఈ ఫంక్షన్ లో ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు సోహెల్. "కొంత కాలంగా నాపై, నా ఫ్యామిలీపై కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు. నేను బిగ్ బాస్ 4లో స్కామ్ చేసి వచ్చానంటున్నారు.
కానీ నా బాధ ఎవరికీ తెలీదు. ఆ రోజు నేను రూ. 25 లక్షలు తీసుకుని బయటికొచ్చాను. అప్పుడు ఆ మనీ నాకు చాలా అవసరం. ఆ డబ్బుతో నా చెల్లి పెళ్లి చేశాను. ఓ మధ్యతరగతి అన్నగా చెల్లి పెళ్లి చేయడం ఎంత కష్టమో మీలో ఎంతమందికి తెలుసు. నా సక్సెస్ వెనక మా నాన్న ఉన్నాడు. నేను ఎవరి ఇంటి నుంచి డబ్బు తీసుకురాలేదు. నాకు ఆఫర్ ఇచ్చారు. నేను తెచ్చుకున్నా. అందులో మరికొంత మనీని ఓల్డేజ్ హోంకు ఇచ్చాను. కానీ ఇవన్నీ తెలీకుండా నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తుండటం చూసి బాధగా అనిపిస్తోంది...మరోసారి ఫామిలీ వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తే ఒక్కొక్కడిని వెతికిమరీ కొడతానని వార్నింగ్ ఇచ్చాడు సోహెల్. ఎవరిని కూడా నెగటివ్ గా ట్రోల్ చేయొద్దని" రిక్వెస్ట్ చేసాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



