అనుష్క అయితే ఓకే అంటున్న నాగార్జున...!
on Sep 24, 2018
`సోగ్గాడే చిన్నినాయనా` చిత్రం నాగార్జున కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రం దర్శకుడుగా పరిచయం అయ్యాడు. అయితే `సోగ్గాడే చిన్నినాయనా` సీక్వెల్ ఉంటుందంటూ ప్రతిసారి నాగార్జున చెబుతూ వచ్చేవారు. అయితే అది కార్యరూపం దాలుస్తోందట. అవును సీనియర్ రైటర్ సత్యానంద్ కళ్యాణ్ కృష్ణ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారట. అయితే ఈ చిత్రంలో సోగ్గాడు సరసన సోగ్గత్తె స్వీటీ అనుష్క హీరోయిన్ గా నటించనుందట. హీరోయిన్ గా ఎవర్ని తీసుకోవాలి అని ఆలోచిస్తున్న తరుణంలో నాగార్జున అనుష్క అయితే బావుంటుందని సజెష్ చేశాడట.
డాన్, ఢమరుకం, కేడీ, రగడ, సోగ్గాడే చిన్నినాయన చిత్రాలలో కలిసి నటించిన నాగ్, అనుష్క మరోసారి తెరపై కనువిందు చేయనున్నారు. బాహుబలి, భాగమతి చిత్రాలతో సక్సెస్ కొట్టిన అనుష్క ప్రస్తుతం తన చేతిలో పెద్దగా సినిమాలేవీ లేవు. ఇలాంటి తరుణంలో మళ్లీ నాగార్జునానే అనుష్కకు అవకాశం ఇస్తున్నాడంటూ సినీ పండితలంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పై వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కుతుంది. సోగ్గాడే గా ఇరగొట్టిన నాగ్ బంగార్రాజుగా అదరగొట్టబోతున్నాడన్నమాట.