స్నేహకి అంత పెద్ద వ్యాధి ఉందా?
on May 24, 2017

జూనియర్ ఐశ్వర్య రాయ్ గా సల్మాన్ ఖాన్ అండదండలతో లక్కీ అనే బాలీవుడ్ చిత్రం తో గ్రాండ్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన యాక్ట్రెస్ స్నేహ ఉల్లాల్ తర్వాత హిట్ సినిమా ఉల్లాసంగా ఉత్సాహంగా ద్వారా తెలుగులో తెరంగ్రేటం చేసింది. తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాలు చేసినా... ఎందుకో సడన్ గా కనుమరుగయ్యింది. అసలు సినిమాలు చేయడం మానేసింది. కొందరు స్నేహ కి ఆఫర్స్ రావట్లేదని అంటే, ఇంకొందరు ఆమె ఇంక సినిమాలు చేయదేమో అనే అభిప్రాయం వెలిబుచ్చారు.
వీటన్నింటికీ వివరణ ఇస్తూ, తాను రక్త సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నానని... ఆ వ్యాధి తనని బలహీనురాలిని చేస్తుందని... కనీసం 30 నిముషాలు కూడా సరిగ్గా నిలబడలేకపోయేదాన్నని... అందుకే తప్పని సరి పరిస్థితుల్లో కమిట్ అయినా ప్రాజెక్ట్స్ అన్ని త్వరగా కంప్లీట్ చేసి వైద్యం చేయించుకోవడానికి ఇంత గ్యాప్ తీసుకున్నానని తన పరిస్థితి వివరించింది. ప్రస్తుతం తాను ఫిట్ గా ఉన్నానని వ్యాధి దాదాపు తగ్గిందని... ఇంక వరుసగా సినిమాలు చేస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పింది. స్నేహ ఉల్లాల్ ప్రస్తుతం ఆయుష్మాన్ భవ అనే తెలుగు సినిమా చేస్తుంది. ఇందులో చరణ్ తేజ్, అమల పాల్ ఇతర అగ్ర నటులు. రీ-ఎంట్రీ లో స్నేహ ఉల్లాల్ అదరగొట్టాలని ఆశిద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



