ENGLISH | TELUGU  

సింగిల్ మూవీ ఫస్ట్ వీక్ రికార్డు కలెక్షన్స్!..విజయవాడ రచ్చ రచ్చ 

on May 16, 2025

కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ శ్రీవిష్ణు(Sri Vishnu)హీరోగా గీతా ఆర్ట్స్ సమర్పణలో అల్లు అరవింద్(Allu Aravind)నిర్మించిన చిత్రం 'సింగిల్'(Single). కేతిక శర్మ(Kethika Sharma)ఇవానా(Ivana)హీరోయిన్లుగా చెయ్యగా, మే 9 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. తొలి షో నుంచే హిట్ టాక్ ని తెచ్చుకుని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా విజయాపదాన దూసుకుపోతుంది.

దీంతో వరల్డ్ వైడ్ గా సింగిల్ మూవీ ఫస్ట్ వీక్ కి 25 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ కలెక్షన్స్ మరింత పెరిగి  శ్రీ విష్ణు కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించే మూవీగా 'సింగిల్' నిలవబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక చిత్ర యూనిట్ మూవీని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్తు విజయయాత్ర చేస్తుంది. అందులో భాగంగా రీసెంట్ గా విజయవాడ వెళ్లిన చిత్ర బృందం సినిమాల్లోని సీన్స్ ని లైవ్ లో ప్రేక్షకులతో  పంచుకుంటు వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ విజయయాత్రలో శ్రీవిష్ణు, కేతికరశర్మ, ఇవానా,తో పాటు ప్రధాన పాత్ర పోషించిన వెన్నెల కిషోర్ పాల్గొన్నారు .

రాజేంద్రప్రసాద్, వి టి వి గణేష్, ప్రభాస్ శ్రీను తదితరులు ఇతర పాత్రల్లో కనపడగా విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు. విద్య కొప్పినీడి, రియాజ్ చౌదరి, భానుప్రతాప కూడా అరవింద్ తో పాటు నిర్మాతలుగా వ్యవహరించగా కార్తీక్ రాజు(caarthick Raju)దర్శకత్వం వహించాడు.


 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.