కమల్ థాయ్‌ల్యాండ్ పంపితే... తిరిగి వచ్చేసిన శింబు
on Mar 18, 2023
తమిళ స్టార్ శింబు ఇప్పుడు క్లౌడ్ నైన్‌లో ఉన్నారు. ఆయన బరువు తగ్గి, నాజూగ్గా మారి, చేసిన సినిమా వెందు తనిందదు కాడు. ముంబైలో హోటల్ నడుపుకునే తమిళులు, మలయాళీలు... అక్కడి లోకలి డాన్స్ కి ఎలా సపోర్ట్ చేస్తుంటారు? అన్యంపుణ్యం తెలియని యువకులు ఆ ఉచ్చులో ఎలా కూరుకుపోతుంటారు? వంటి విషయాలను డిస్కస్ చేసిన సినిమా వెందు తనిందదు కాడు. శింబుకి లక్కీ డైరక్టర్ గౌతమ్ వాసుదేవమీనన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం తమిళ్‌తో పాటు తెలుగులోనూ పెద్ద హిట్ అయింది.
ఈ సక్సెస్ మీద ఉన్నప్పుడే పత్తు తల సినిమాలో నటించారు శింబు. ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది. కన్నడలో మఫ్టీ పేరుతో విడుదలై పెద్ద హిట్ అయిన మూవీకి రీమేక్. పత్తు తలలో గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశారు శింబు. ఆయనకు రీమేక్స్ చేయడం ఇదేం కొత్త కాదు. ఇక్కడ పవన్ కల్యాణ్ చేసిన గబ్బర్‌సింగ్‌ని తమిళంలో రీమేక్ చేసింది శింబునే. పత్తుతల సినిమా ఆడియో వేడుక మార్చి 18న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో వైభవంగా జరగనుంది. సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ లైవ్ కాన్సర్ట్ కూడా ఇదే వేదిక మీద ప్లాన్ చేశారు. ఈ ఆడియో వేడుక కోసం థాయ్‌ల్యాండ్ నుంచి వచ్చేశారు శింబు. థాయ్‌ల్యాండ్‌కి శింబు తనంతట తానుగా వెళ్లలేదు.
ఆయన్ని పంపింది కమల్‌హాసన్. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శింబు. ఆ సినిమాలోని కేరక్టర్ కోసం శింబుని థాయ్‌ల్యాండ్ పంపారు కమల్. కొన్ని మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం కోసం, ఫిట్‌నెస్ ట్రైనింగ్ కోసం శింబుని థాయ్‌ల్యాండ్ పంపారు. అక్కడ శిక్షణ ఇంకా పూర్తికాలేదు. అంతలోనే పత్తు తల కోసం తిరిగి వచ్చేశారు శింబు. కమల్ నిర్మిస్తున్న సినిమాకు దేశింగు పెరియసామి డైరక్టర్. శింబు నయా స్టైల్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
