చంద్రబాబు అరెస్ట్... ఎన్టీఆర్‌ని అలా వదిలేయండి
on Sep 20, 2023
పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఇప్పటివరకు నందమూరి కుటుంబ సభ్యులు ఎవరూ ఈ విషయంపై స్పందించారు కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు స్పందించిన సందర్భం లేదు. అలాగే సోషల్ మీడియా వేదికగా ట్వీట్ కూడా చేయలేదు. దీంతో కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఎన్టీఆర్ మౌనంగా ఉండడం సబబు కాదని విమర్శలు చేస్తున్నారు.
దీంతో ఎన్టీఆర్ గురించి వస్తున్న ట్రోల్స్ పై తాజాగా యాంకర్ శ్యామల స్పందిస్తూ ఎన్టీఆర్ కు మద్దతు తెలిపారు.. శ్యామల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఒకసారి నమ్మి మోసపోయారు... రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుంటూ తన నటనతో ప్రపంచం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంటున్నారు. ఆయన్ని అలా వదిలేయండి... మనకు అనుకూలంగా ఉండి మనకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళు ఉంటేనే మనం వారి బాగుండాలని కోరుకుంటాము లేకపోతే అంతే అనడం ఎంతవరకు సబబు అంటూ ఈ సందర్భంగా శ్యామల ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచారు. ఇలా ఎన్టీఆర్ కి మద్దతు తెలుపుతూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Also Read