శ్వేతబసు నోరు విప్పితే...ఆ హీరోలు మటాష్!
on Oct 1, 2014
వ్యభిచారం కేసులో శ్వేతబసు అరెస్ట్ వ్యవహారం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. శ్వేత ఇంత పనిచేసిందా? అని చాలామంది నివ్వెరపోయారు. కొంతమంది టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు మాత్రం షాక్‌కి గురయ్యారు. ఆ షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. దానికి కారణం.. వాళ్ల గుట్టు శ్వేత బసు చేతిలో ఉండడమే. శ్వేత తప్పు చేసి ఉండొచ్చుగాక. కానీ ఆ తప్పుకి ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ చాలామంది హీరోలు, నిర్మాతలు కారణం. తమ వాంఛ తీర్చమని కొంతమంది కథానాయకులు శ్వేతని చాలాసార్లు ఇబ్బంది పెట్టారని, టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా చలామణి అవుతున్న ఒకాయన శ్వేతని బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా వెనుకాడలేదని ఇన్ సైడ్ రిపోర్ట్. అవకాశం ఇప్పిస్తానని చాలామంది శ్వేత బసుని ఎరగా వాడుకొన్నారు. నెలల తరబడి ఆఫీసులు చుట్టూ తిప్పించుకొన్నారు. తనకు సహకరించలేదని అలిగిన ఓ నిర్మాత.. ఆమెకు ఎలాంటి పబ్లిసిటీ దొరక్కుండా జాగ్రత్త పడి తన అక్కసు తీర్చుకొన్నాడు. శ్వేత జీవితాన్ని లోతుగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తే.. ఇలాంటి సంఘటనలు కోకోల్లలు. శ్వేత నోరు విప్పితే తమ జాతకాలు బయటపడతాయని భయపడుతున్నారంతా. అయితే శ్వేత తాను ఇరుక్కోవడమే కాకుండా, మిగతావారినీ బుక్ చేస్తుందా? లేదంటే ఆ గుట్టు తనలోనే దాచుకొంటుందా?? ఏమో మరి.. ఆ హీరోల భవిష్యత్తు శ్వేత తీసుకొనే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
