శృతి హాసన్ వస్తుందా? రాదా?
on Feb 2, 2019
కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతి హాసన్ మళ్లీ సినిమాల్లోకి వస్తుందా? రాదా? మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటుందా? లేదా? ప్రస్తుతం చెన్నై సినిమా సిర్కిళ్ళల్లో చక్కర్లు కొడుతున్న వార్త ఇది! ఎందుకంటే... ఆమెకు ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. సుమారు ఏడాదిన్నర అవుతోంది... శృతి హాసన్ నటించిన సినిమా థియేటర్లలోకి వచ్చి! తెలుగులో పవన్ కల్యాణ్ 'కాటమరాయుడు', తమిళంలో 'సింగం 3', హిందీలో 'బెహన్ హోగీ తేరి' సినిమాల తరవాత శృతి హాసన్ మరో సినిమా చేయలేదు. విదేశాల్లో మ్యూజిక్ షోలు, తమిళంలో ఓ టీవీ షోకి హోస్ట్ చేస్తూ కాలం గడిపేసింది. మధ్యలో కొన్ని అవకాశాలు శృతి హాసన్ తలుపు తట్టినా స్పందించలేదు. ఇప్పుడు తలుపు తట్టిన అవకాశం ఆలోచించుకునేలా ఉంది.
తమిళంలో వైవిధ్యమైన, కథా బలమున్న సినెమాలు చేస్తాడని పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి సరసన నటించే అవకాశం శృతి హాసన్ కి వచ్చిందని టాక్. ఎస్.పి. జననాథన్ అని ఓ తమిళ దర్శకుడితో విజయ్ సేతుపతి ఓ సినిమా చేయనున్నారు. అందులో హీరోయిన్ అవకాశం శృతి హాసన్ చెంతకు వెళ్ళింది. ఆమె ఏమంటుందో? సంతకం చేసి మళ్ళీ సినిమాల్లోకి వస్తుందో? రాదో? వెయిట్ అండ్ సీ!!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
