ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా.. లైవ్ లో చెప్పేసిన శ్రుతి హాసన్!
on Jan 10, 2022

కమల్ హాసన్ కూతురిగా సినీ పరిశ్రమకు పరిచయమైన శ్రుతి హాసన్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న శ్రుతి హాసన్.. కొంతకాలంగా డూడల్ ఆర్టిస్ట్ శాంతను హజరికాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే శాంతనుకి తానే మొదట ప్రపోజ్ చేశానని తాజాగా శ్రుతి రివీల్ చేసింది.
శాంతనుతో కలిసి ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో తాజాగా అభిమానులతో ముచ్చటించింది శ్రుతి. ఈ సందర్భంగా వారి ప్రేమకు సంబంధించిన ప్రశ్నలు ఎదురు కాగా, ఇద్దరూ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ముందుగా మీలో ఎవరు మరొకరిని ఇష్టపడ్డారు అని అడగ్గా.. శాంతను తనే అని చెప్పాడు. ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు అని అడగ్గా.. తానే మొదట 'ఐ లవ్ యూ' చెప్పానని శ్రుతి తెలిపింది. ఎవరు ఎక్కువగా డబ్బు ఖర్చు పెడతారు? అని అడగ్గా శ్రుతినే అని చెప్పాడు శాంతను. ఇద్దరిలో ఎవరు ఎక్కువగా వాదిస్తారు? అంటే శ్రుతి తనే బదులిచ్చింది.

కాగా ప్రస్తుతం శ్రుతి చేతిలో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న 'సలార్'తో పాటు, బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న #NBK107 ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



