బిగ్ సర్ ప్రైజ్.. గుమ్మడి నర్సయ్య బయోపిక్ లో సూపర్ స్టార్!
on Oct 22, 2025

చిన్న చిన్న రాజకీయ నాయకులే మందీ మార్బలంతో హడావుడి చేసే రోజులివి. అలాంటిది ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా.. సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు గుమ్మడి నర్సయ్య. ఆ ప్రజా నాయకుడి జీవితం ఆధారంగా 'గుమ్మడి నర్సయ్య' (Gummadi Narsaiah) పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. టైటిల్ పాత్రను కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) పోషిస్తుండటం విశేషం.
పరమేశ్వర్ దర్శకత్వంలో ప్రవళిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై సురేష్ నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమాని ఎప్పుడో ప్రకటించారు. అయితే ఇప్పుడు శివ రాజ్‌కుమార్ నటిస్తున్నాడని రివీల్ చేస్తూ, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో కార్లు ఆగి ఉంటే, గుమ్మడి నర్సయ్య పాత్రధారి శివ రాజ్‌కుమార్ సైకిల్ తో సాధారణ వ్యక్తిలా కనిపించడం ఆకట్టుకుంటోంది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



