జూన్ 3న శర్వానంద్ పెళ్లి
on May 17, 2023

ఈ ఏడాది జనవరిలో రక్షిత రెడ్డితో హీరో శర్వానంద్ ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్ లో వీరి నిశ్చితార్థం జరిగింది. తాజాగా వీరి పెళ్లి డేట్ ని ప్రకటించారు. జూన్ 3 న శర్వా-రక్షిత వివాహం జరగనుంది.
జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్ పెళ్లిని ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 2 న మెహందీ ఫంక్షన్ కాగా, జూన్ 3 ఉదయం పెళ్ళికొడుకు ఫంక్షన్ ఉంటుంది. ఇక జూన్ 3 రాత్రి రక్షిత మెడలో శర్వా మూడు ముళ్ళు వేయనున్నాడు. పెళ్లి ముహూర్తం రాత్రి 11 గంటలకు అని సమాచారం. రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుక జరగనుందట. బంధువులు సన్నిహితులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరు కానున్నారని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



