హీరో శర్వానంద్ కి యాక్సిడెంట్!
on May 28, 2023
హీరో శర్వానంద్ కి యాక్సిడెంట్ జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటన ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. ఓ బైక్ అడ్డురావడంతో, డ్రైవర్ దానిని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో శర్వానంద్ సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
ఇటీవల రక్షిత రెడ్డితో శర్వానంద్ ఎంగేజ్ మెంట్ జరిగింది. జూన్ 3న ఆయన పెళ్లి జైపూర్ లో ఘనంగా జరగనుంది. అయితే పెళ్ళికి ఐదారు రోజుల ముందు ఆయనకు ప్రమాదం జరిగిందనే వార్తతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి వరుసగా అందరూ ఫోన్లు చేస్తూ ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో శర్వానంద్ టీం స్పందించింది. ఇది చాలా స్పల్ప సంఘటన అని.. కారుకి గీతాలు పడటం తప్ప, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. కావున ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రకటించింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
