సెన్సార్ బోర్డు తీరుపై షకీలా గరమ్ గరమ్
on Feb 3, 2020
ప్రాంతీయ సెన్సార్ కార్యాలయం తీరుపై శృంగార తార షకీలా మండిపడుతోంది. తన చిత్రానికి ఎందుకు సెన్సార్ ఇవ్వడం లేదో అని ఆవేదన చెందుతోంది. అసలు వివరాల్లోకి వెళితే... 'లేడీస్ నాట్ అలౌడ్' అని షకీలా ఓ సినిమా నిర్మించారు. ఆ చిత్రానికి ఇంకా సెన్సార్ రాలేదు. సెన్సార్ కోసం షకీలా దరఖాస్తు చేసుకుని పది నెలలు అవుతోంది. ప్రాంతీయ సెన్సార్ బోర్డు కార్యాలయం వాళ్ళు ఏవో అభ్యంతరాలు చెప్పారట. దాంతో వివాదం సెన్సార్ ట్రిబ్యునల్ ముందుకు వెళ్ళింది. దీనిపై షకీలా మాట్లాడుతూ "నేను నిర్మించిన 'లేడీస్ నాట్ అలౌడ్'కి సెన్సార్ బోర్డు ఎందుకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదో తెలియడం లేదు. మా సినిమా కంటే వల్గారిటీ ఎక్కువ ఉన్న సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా విడుదలయ్యాయి. పది నెలలుగా నా సినిమా ఆపడానికి కారణం ఏమిటో తెలియడం లేదు" అని అన్నారు.
ప్రస్తుతం షకీలా నటించిన మరో సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఆమె గత చిత్రాలకు భిన్నమైన సినిమా అది. ఆ సినిమా టైటిల్ 'షకీలా రాసిన కుటుంబ కథా చిత్రం'. పక్కా ఫ్యామిలీ ఎంటర్టెనర్ అట. కథ రాసింది షకీలాయే. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ " నేను నిర్మించిన సినిమాకు సెన్సార్ ఇవ్వడం లేదు. ఇక, నేను రాసిన సినిమా అంటే ఏం చేస్తారో? షకీలా ఎప్పుడూ అటువంటి సినిమాలే చేస్తుందా? ఫ్యామిలీ సినిమాలు చేయదా? అని విమర్శలు చేస్తున్నారు. నేను అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించు కోవడం కోసం ఈ సినిమా చేశా" అని అన్నారు.
Also Read