ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు
on Aug 18, 2022

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఎస్కలేటర్ మీద నుంచి జారి పడి దాదాపు పది మంది విద్యార్థులు గాయపడ్డారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో దేశభక్తిని నింపేలా పలు థియేటర్లలో 'గాంధీ' సినిమాను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులను థియేటర్స్ కి తీసుకెళ్లి ఉచితంగా సినిమాను చూపిస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ విద్యాభవన్ కు చెందిన విద్యార్థులు గాంధీ సినిమాను చూసేందుకు ఆర్కే సినీ మాక్స్ కి వెళ్లారు. అయితే అక్కడ సాంకేతిక లోపం కారణంగా ఎస్కలేటర్ ఒక్కసారిగా స్పీడ్ గా వెళ్లడంతో విద్యార్థులు కిందపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులు గాయ పడినట్లు సమాచారం.
విద్యార్థులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారని, వారికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



