ENGLISH | TELUGU  

Sarvam Maya Movie Review: సర్వం మాయ మూవీ రివ్యూ

on Jan 31, 2026


మూవీ : సర్వం మాయ
నటీనటులు: నివీన్ పౌలీ, రియా షిబు, అజు వర్గీస్ తదితరులు
ఎడిటింగ్: రతిన్ రాధాకృష్ణన్
సినిమాటోగ్రఫీ: శరణ్ వేలాయుధన్
మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరన్
నిర్మాతలు: అజయ్ కుమార్,  రాజీవ్ మీనన్
దర్శకత్వం: అఖిల్ సత్యన్
ఓటీటీ : జియో హాట్ స్టార్

నివీన్ పౌలీ, రియా షిబు ప్రధాన పాత్రల్లో మలయాళంలో రూపొందించిన సినిమా ' సర్వం మాయ'. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం...

కథ:

కేరళలోని ఓ ప్రాంతంలో ప్రభేందు అలియాస్ ప్రభా(నివీన్ పౌలీ) బ్రహ్మణ కుటుంబంలోని చిన్న కొడుకు. అతను వాళ్ళ నాన్న మాటని కాదని ఇంట్లో నుండి వచ్చేస్తాడు. ప్రభా అన్న, తండ్రిలా పౌరోహిత్యం చేయడు. మంచి గిటారిస్ట్ అవ్వాలనేది ప్రభా గోల్. ఆ ప్రయత్నాల్లో ఉంటూ స్టేజీ షోలు చేస్తుంటాడు. ఒకరోజు వాళ్ళ నాన్నని చూడటానికి సొంతూరికి వస్తాడు ప్రభా. రెండు నెలలు ఖాళీగా ఉండటం ఎందుకని డబ్బుల కోసం బావ రూపేష్(అజు వర్గీస్)తో కలిసి పూజలు, హోమాలు చేస్తుంటాడు. ఓసారి ఒకరి ఇంట్లో పిల్లాడికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తాడు. ఆ తర్వాత నుంచి ఆ ఆడ దెయ్యం(రియా షిబు).. ప్రభా వెంటపడుతుంది. ఇతడికి మాత్రమే కనిపిస్తూ, ఇతడితోనే మాట్లాడుతుంటుంది. ఆ దెయ్యానికి.. తను ఎవరు? ఎలా చనిపోయాననే విషయాలేమీ గుర్తుండవు. దీంతో ఆ దెయ్యానికి డెలులు అని పేరు పెడతాడు ప్రభా. మరి డెలులు వల్ల ప్రభా జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? డెలులు ఎలా చనిపోయిందనేది మిగతా కథ.

విశ్లేషణ:

కొన్ని డ్రీమ్స్ ని నెరవేర్చుకోవడానికి సొంత కుటుంబాన్ని కాదనుకొని ఓ అడుగు ముందుకేస్తాడు హీరో.. ఆ లక్ష్యం దిశగా అడుగులేస్తున్నప్పుడు తనకి ఓ దెయ్యం పరిచయం అవుతుంది. తను మంచి దెయ్యం. హీరోకి ఏ విధమైన హాని చేయదు. అతనికి సపోర్ట్ గా నిలుస్తుంది. ఈ స్టోరీ లైన్ కొత్తగా ఉంది. 

ఫ్రెష్ ఫీల్ తో సాగే ఈ కథ అందరికి కనెక్ట్ అవుతుంది. మొదట్లో కాస్త స్లోగా సాగినా దెయ్యం, హీరోతో కలిసినప్పటి నుండి కథలో వేగం పెరుగుతుంది. ఇద్దరి మధ్య ఓ బాండ్ క్రియేట్ అవుతుంది. అది చూసేవాళ్ళకి ఓ ఫీల్ గుడ్ లా అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ ఎవరు ఊహించరు.

సినిమా ఫస్టాఫ్ లో కాస్త స్లోగా సాగుతుంది. అది మినహా మిగతాంతా సినిమాకి ప్రధాన బలం. సెకెంఢాఫ్ లో ప్రీతీ పాత్రని చూపించి ఉంటే బాగుండేది. దెయ్యం చేసే కామెడీకి ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. హీరో మొదట్లో కంగారుపడినా దెయ్యంతో రాపో బాగా కుదురుతుంది. అయితే అది ఎంతవరకు అని చివరి వరకు చూస్తేనే ఆడియన్ ఫీల్ అవుతాడు. సినిమాని ఏ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే నచ్చుతుంది. ఎందుకంటే ప్రతీ సినిమాలో ఉండే కథే ఇది. కానీ క్యారెక్టర్లతో మ్యాజిక్ చేశాడు దర్శకుడు.

సినిమాలో ఎక్కడ అసభ్య పదజాలం వాడలేదు. అశ్లీల దృశ్యాలు లేవు. ఫ్యామిలీతో కలిసి చూసేలా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

ప్రభేందు అలియాస్ ప్రభాగా నివీన్ పౌలీ, డెలలుగా రియా షిబు, రూపేష్ గా అజు వర్గీస్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. మిగతా వారు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. 

ఫైనల్ గా : ఈ వీకెండ్ కి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయొచ్చు.

రేటింగ్: 2.75 /5 

✍️. దాసరి మల్లేశ్

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.