సంక్రాంతికి వస్తున్నాం ఓటిటి ఫిక్స్ అయ్యింది
on Feb 7, 2025
విక్టరీ వెంకటేష్,(Venkatesh)అనిల్ రావిపూడి(Anil Ravipudi)ఐశ్వర్యరాజేష్,మీనాక్షిచౌదరి,దిల్ రాజు,భీమ్స్, కాంబోలో సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'.విడుదలైన అన్ని చోట్ల ఘన విజయాన్ని అందుకున్న ఈ మూవీ వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచింది.
ఇక ఈ మూవీ ఓటిటి హక్కులని 'జీ 5 ',టెలివిజన్ రైట్స్ ని 'జీ తెలుగు' దక్కించుకున్నాయి.దీంతో త్వరలోనే ఓటిటి డేట్ ని సదరు సంస్థ రిలీజ్ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.ఇక ఈ మూవీ థియేటర్స్ లోకి అడుగుపెట్టి మూడు వారాలు దాటుతున్నా కూడా కలెక్షన్స్ మాత్రం చాలా ఏరియాల్లో స్టడిగానే ఉన్నాయి.రీసెంట్ గా 300 కోట్ల క్లబ్ లోకి కూడా చేరి సరికొత్త చరిత్రని సృష్టించింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
