కత్తి హీరోయిన్‌ని అరెస్ట్ చేశారు!
on Oct 30, 2014

కత్తి అంటే విజయ్ కత్తి అనుకొంటున్నారా..? అదేం కాదు. మన సమంత చాలా మంచిది. ఈ కత్తి... కల్యాణ్‌రామ్‌ది. ఆ సినిమాలో సనాఖాన్ అనే బాలీవుడ్ భామ కథానాయికగా నటించింది. ఆ తరవాత మిస్టర్ నోకియాలో చేసింది. సల్మాన్ ఖాన్ జై హోలోనూ నటించింది. ఇప్పుడు కటకటాల ఊసలు లెక్కపెడుతోంది. సనాఖాన్‌కీ, ఆమె ప్రియుడు ఇస్మాయిల్ నీ ముంబై పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఇస్మాయిల్ తనని లైంగికంగా వేధిస్తున్నాడని, సనాఖాన్‌తో కలసి తనపై దాడి చేశాడని ఓ మహిళ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో సనాఖాన్‌ని అరెస్ట్ చేశారు. సనాకి పోలీసుల గొడవలు, పోలీస్ స్టేషన్ కొత్తేం కాదు. ఇది వరకు ఓ కిడ్నాప్ కేసులోనూ ఆమె అరెస్ట్ అయ్యింది. ఇది రెండోసారన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



