కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన సామ్రాట్
on Dec 16, 2022

ఈ ఏడాది బిగ్ స్క్రీన్ , స్మాల్ స్క్రీన్ సెలెబ్స్ కి బాగా కలిసొచ్చిన సంవత్సరం అని చెప్పొచ్చు. ఎందుకంటే పెళ్లిళ్లు కానీ వాళ్ళు పెళ్లిళ్లు చేసుకున్నారు. పిల్లల్ని కనడం వాయిదా వేసుకున్న వాళ్ళు పిల్లల్ని కనేసారు. కొత్త ఇళ్ళు కొనుక్కున్నారు, కొత్త కార్లు కొనుక్కున్నారు..ఇలా ఎంతో మందిని ఇప్పటివరకు చూసాం. ఇక ఇప్పుడు సామ్రాట్ రెడ్డి కూడా కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. మంచి నటుడు, బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ ఐన సామ్రాట్ తెలుగు ఆడియన్స్ కి బాగా తెలుసు. ‘అహ నా పెళ్ళంట’ ‘పంచాక్షరీ’ ‘దేనికైనా రెడీ’ వంటి మూవీస్ కనిపించిన సామ్రాట్ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాడు.
ఇక ఇప్పుడు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసి ఆ ఫొటోస్ ని వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసాడు. "న్యూ హోమ్…న్యూ డ్రీమ్స్…న్యూ మెమోరీస్..వెల్కమ్ టు అవర్ హౌస్" అని కాప్షన్ పెట్టాడు. ఇక దీప్తి సునైనా "వస్తున్నా" అని రిప్లై ఇచ్చింది. అలాగే విద్యురామన్, భానుశ్రీ కంగ్రాట్యులేషన్స్ అని చెప్పారు. నెటిజన్స్ కూడా ఆయనకు విషెస్ చెప్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



