అప్పుడు మహేష్.. ఇప్పుడు సంపూర్నేష్
on Nov 17, 2014
.jpg)
పోకిరి.. టాలీవుడ్ రికార్డులను షేక్ చేసిన చిత్రం. మహేష్‌బాబు స్టామినాని నిరూపించిన చిత్రం. పూరిని దర్శకుడిగా టాప్ ఛెయిర్‌లో కూర్చోబెట్టిన చిత్రమిది. ఆ సినిమాకి సీక్వెల్ రావాలని కోరుకోని మహేష్ అభిమాని ఉండడు. పూరి కూడా పోకిరి 2 సినిమా తీస్తానని చాలా సందర్భాల్లో చెప్పాడు కూడా. ఇటీవల ఫిల్మ్ ఛాంబర్‌లో పోకిరి రిటర్న్స్ టైటిల్ ఒకటి రిజిస్టర్ అయ్యింది. అది మహేష్ గురించేనని చాలామంది భ్రమపడ్డారు. కానీ ఇప్పుడో అసలు నిజం తెలిసింది. ఈ సినిమాలో హీరో మహేష్ కాదట. బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు అట. సంపూ కోసమే నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. రాంగోపాల్ వర్మ- సంపూర్నేష్‌బాబుల కలయికలో ఓ చిత్రం రాబోతోంది. ఈ సినిమా కోసమే పోకిరి రిటర్న్స్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారట. ఇందులో సంపూ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడన్నమాట. మరి ఈ నయా పోకిరి చేసే కిరికిరి ఏమిటో తెరపైనే చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



