సమంత మాటలని హీరోలు వింటే క్యూ కడతారా! ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిదేనా!
on Nov 10, 2024
.webp)
స్టార్ హీరోయిన్ సమంత(samantha)నటించిన సిటాడెల్ హానీ బన్నీ(citadel honey bunny)వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటిటి వేదికగా సందడి చేస్తుంది. యాక్షన్ డ్రామా అండ్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ నవంబర్ 6 న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలవ్వగా యాక్షన్ కోణంలో సామ్ ప్రదర్శించిన నటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
ఈ సందర్భంగా లేటెస్ట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సామ్ మాట్లాడుతూ సిటాడెల్ లో నేను చేసిన యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి.హీరోకి సరి సమానమైన పాత్ర పోషించిన నాకు ఇందులోని క్యారక్టర్ సవాలుగా అనిపించినా హీరోకి ఈ మాత్రం తగ్గకుండా సమానంగా యాక్షన్ సీక్వెన్స్ చేశాను.ఇలా హీరోలకి ధీటుగా నటించే క్యారెక్టర్స్ అంటేనే ఎక్కువ ఆసక్తి. ఇలాంటి కథల కోసం నటీమణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ అలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి.నా సినీ కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా కొన్నిటినే ఎంచుకున్నాను.
.webp)
నాకు వచ్చిన ఆఫర్స్ కి నేను నటించిన సినిమాలకి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. రెండు మూడు సన్నివేశాలకు పరిమితమయ్యే క్యారెక్టర్స్ కి నేను చాలా దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. ఇక ఈ సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ లో వరుణ్ ధావన్(varun dhawan)హీరోగా చెయ్యగా సిమ్రాన్, సికందర్ కేర్,మీనన్, సకిబ్ సలీం ముఖ్య పాత్రలు పోషించారు.రాజ్ అండ్ డికె(raj and dk) దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



