సల్మాన్ 'కిక్'కి 100 కోట్లు
on Jul 29, 2014
బాలీవుడ్ సూపర్ హీరో సల్మాన్ ఖాన్ కి సరైన కథ పడితే భాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అతని యావరేజ్ సినిమానే 100 కోట్ల మార్కు ఈజీగా చేరుకుంటుంది. అదే సూపర్ హిట్ కథ పడితే కలెక్షన్ల సునామీ ఖాయం. ఇప్పుడు అదే జరుగుతుంది.
తెలుగులో రవితేజ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా 'కిక్'ని సల్మాన్ ఖాన్ రీమేక్ చేసి రంజాన్ స్పెషల్ గా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా బాలీవుడ్ లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. కేవలం నాలుగు రోజుల్లో 100కోట్లనూ దాటి వసూళ్ళ 'కిక్'నూ అందించింది. ఫస్ట్ డే 26.50 కోట్లు, సెకండ్ డే 27.15, థర్డ్ డే 30.18 కోట్లు కలెక్ట్ చేసి నాలుగో రోజుకే 100 కోట్ల మార్క్ చేరిన 4వ మూవీగా రికార్డ్స్‌కు ఎక్కింది. అంతేకాదు, ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 300 కోట్ల మార్క్‌ను అందుకుంటుందని బాలీవుడ్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.