సినిమాల్లో క్రేజ్ ఉంది కదా అని రాజకీయాల్లోకి రాకూడదని తెలుసుకో
on Feb 12, 2025
.webp)
సుప్రీం హీరో సాయి దుర్గాతేజ్(Sai Durga Tej)ప్రస్తుతం 'సంబరాల యేటి గట్టు'(Sambarala yeti Gattu)అనే డిఫరెంట్ టైటిల్ తో కూడిన సినిమా చేస్తున్నాడని తెలిసిందే.కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ తో మూవీపై అభిమానుల్లోనే కాకుండా,ప్రేక్షకుల్లో కూడా అంచనాలు పెరిగాయని చెప్పవచ్చు.రీసెంట్ గా తేజ్ ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం'అహోబిలం'లో కొలువు తీరిన శ్రీ లక్షి నరసింహ స్వామిని దర్శించుకున్నాడు.ఆలయ అధికారులు,పూజారులు తేజ్ కి స్వాగతం పలికి దర్శనం అనంతరం తీర్ధ ప్రసాదాలు అందించారు.
అనంతరం కొంత మంది మీడియా వాళ్ళు తేజ్ తో తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రస్తావించారు.అందుకు తేజ్ మాట్లాడుతు రాజకీయాలు అనేవి చాలా పెద్ద విషయం.ఎంతో నేర్చుకొని అందులో అడుగుపెట్టాలి.కానీ అది అంత సులభం కాదు.సినిమాల్లో క్రేజ్ ఉంది కదా అని రాజకీయాల్లోకి రాకూడదు.ప్రజా సమస్యలు తెలుసుకోవాలి.కాకపోతే నన్ను దయ చేసి సినిమాకి దూరం చెయ్యకండి.భవిష్యత్తు గురించి కూడా పెద్దగా ఆలోచించను. ఈ నిమిషం ఏంటనేదే నాకు ముఖ్యం.మరుసటి క్షణం,మరుసటి రోజు ఏం జరుగుతుందో కూడా చెప్పలేం.ఈ పూట కడుపు నిండిందా,పది మంది కడుపు నింపాన అని మాత్రమే ఆలోచిస్తానని
చెప్పుకొచ్చాడు
'సంబరాల యేటి గట్టు' ని 'హనుమన్'(Hanuman)మూవీ ఫేమ్ 'నిరంజన్ రెడ్డి'(Niranjan Reddy)'చైతన్య రెడ్డి'(Chaitanya reddy)నిర్మిస్తుండగా రోహిత్ కె పీ(Rohith Kp)దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఐశ్వర్య లేక్ష్మి(Aiswarya lekhsmi)హీరోయిన్ కాగా,జగపతి బాబు,శ్రీకాంత్, అనన్య నాగేళ్ల,సాయి కుమార్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



