సాయి సత్తా చూపించాడు
on Nov 18, 2014
(1).jpg)
తొలి సినిమా 'రేయ్' విడుదల కాలేదు. అదెప్పుడొస్తుందో తెలీదు. శ్రీహరి అకాల మరణంతో `పిల్లా నువ్వు లేని జీవితం` సినిమా కూడా టెన్షన్ పెట్టింది. దాంతో సాయిధరమ్‌తేజ్ పరిస్థితి ఏంటి?? అని మెగా ఫ్యాన్స్ సైతం ఫీలైపోయారు. ఎట్టకేలకు 'పిల్లా నువ్వు లేని జీవితం' విడుదలై మంచి టాక్ సంపాదించుకొంది. హీరోగా సాయికి మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు ఈసినిమాకి కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. తొలి మూడు రోజుల్లోనూ రూ.5.5 కోట్లు సంపాదించుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మా టీవీ శాటిలైట్ హక్కుల్ని మంచి రేటుకే కొనుగోలు చేసిందట. ఈ సినిమాతో అటు నిర్మాతలు, ఇటు బయ్యర్లు ఇద్దరూ సేఫ్ అయిపోతారని బాక్సాఫీసు రిపోర్ట్స్‌ని బట్టి అర్థమవుతున్నాయి. సాయి టాలెంట్, పిల్లా నువ్వు లేని జీవితం రిజల్ట్ రెండూ చూసి.. సాయిని బుక్ చేసుకోవడానికి నిర్మాతలు కూడా రెడీ అవుతున్నారు. సాయి ఓకే అంటే.... సినిమాలు తీయడానికి నలుగురు నిర్మాతలు రెడీగా ఉన్నారట్ట. మరోవైపు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా ఈనెల 27న మొదలైపోతోంది. మొత్తానికి సాయి ఫస్ట్ లుక్‌తోనే తన టాలెంట్ చూపించేశాడు. మరి దాన్ని ఎంత వరకూ నిలబెట్టుకొంటాడో, హిట్స్‌గా ఎలా మలచుకొంటాడో కాలమే చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



