`భోగి` గా మారుతోన్న సాయితేజ్!!
on Jun 4, 2019

`చిత్రలహరి` చిత్రంతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన హీరో సాయితేజ్. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరో సినిమాకు రెడీ అయిపోతున్నాడు తేజ్. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నానంటూ ప్రకటించాడు తేజ్. ఇటీవల స్క్రిప్ట్ మెగాస్టార్ చిరంజీవి సలహాలు, సూచనలతో ఫైనలైజ్ అయింది. ఇక త్వరలో సెట్స్ మీదకు వెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి `భోగి` అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ బేనర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా నేలటిక్కెట్ హీరోయిన్ మాళవిక శర్మను తీసుకోనున్నారట. టైటిల్ ను బట్టి ఈ సినిమాలో తేజ్ భోగి పాత్రలో కనిపించబోతున్నాడని అర్థమవుతోంది. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



