మెగా ఫ్యామిలీలో అసలైన అందగాడు... అమ్మాయిలకు డ్రీం బాయ్...
on Jun 28, 2017
.jpg)
మెగా ఫామిలీ అంటే నిన్నటి చిరంజీవి తరం నుండి నేటి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వరకు అందరూ మాస్ ఇమేజ్ కోసం తాపత్రయ పడిన వల్లే. ఈ క్రమంలో క్లాస్ సెక్షన్ ని వీళ్ళు దాదాపు మర్చి పోయారు. ఇంకా చెప్పాలి అంటే మెగా ఫామిలీ కి మాస్ ఫాలోయింగ్ ఎక్కువుంది కానీ అమ్మాయిలలో వీళ్ళకి అభిమానులు తక్కువనే చెప్పాలి. కానీ, నిన్నటి వరకు మాస్ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన అదే మెగా ఫామిలీ నుండి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడొక క్లాస్ అండ్ ఫామిలీ సబ్జెక్టు చేస్తున్నాడు. జవాన్ అనే ఈ సినిమా స్టిల్స్ ఇంతకు ముందే విడుదల చేసారు. ఈ స్టిల్స్ లో తేజ్ చాలా క్లాసీగా, అందంగా ఉన్నాడని అంటున్నారు. ఒక యాంగిల్ లో చూస్తే ఆ హైటూ, ఆకారంతో అచ్ఛం ప్రభాస్ లాగా కనపడుతున్నాడని అంటున్నారు. మిర్చిలో అనుష్క ప్రభాస్ ని చూసి ఒక డైలాగ్ చెబుతుంది. ఏమున్నాడే అని. ఇప్పుడు అమ్మాయిలు నిజంగా సాయి ధరమ్ తేజ్ ని చూసి అదే డైలాగ్ చెబుతున్నారు- ఏమున్నాడే... ఇంతందంగా ఉన్నాడేంటి అని. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ అమ్మాయిలకి డ్రీం బాయ్ అవడం ఖాయం అంటున్నారు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



