ఒకే సినిమా.. ఇద్దరు శ్రద్ధాకపూర్లు. ఇక డబుల్ ధమాకానే!
on Sep 12, 2017

స్టార్ హీరో సినిమాలలో హీరోయిన్ డ్యూయెల్ రోల్ చేయడం ఏంటి చెప్మా... ఇదేదో వైరైటీగా ఉందే! అనుకుంటున్నారు ఇప్పుడు అంతా. ఇంతకీ ఏ స్టార్ హీరో? ఏ సినిమా? ఏ హీరోయిన్? ఇదేగా మీ అనుమానాలు. ఆ స్టార్ హీరో ప్రభాస్. ఆ సినిమా పేరు ‘సాహో’. ఆ హీరోయిన్ పేరు శ్రద్ధకపూర్. అవును... ‘సాహో’లో శ్రద్ధాకపూర్ ద్విపాత్రాభినయం చేస్తోందట. ఒకమ్మాయేమో... చాలా ఇన్నోసెంట్ గా పల్లెటూరి పిల్లాలా సంప్రదాయబద్ధంగా కనిపిస్తుందట. రెండో అమ్మాయేమో... రెబల్ అట.
ఫైటింగులు గట్రా కూడా చేస్తోందట. నిజంగా ఇది ట్విస్టే. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో ఇంకొకరిపై దృష్టి పెట్టరు. హీరోగారి చుట్టూనే కథంతా నడుస్తుంటుంది. కానీ.. ‘సాహో’లో హీరోయిన్ డ్యూయెల్ రోల్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. సాహో’ పిరియాడికల్ మూవీ అని గతంలో చెప్పుకున్నాం కదా. అంటే.. స్వతంత్ర్యానికి పూర్వం పాత్రలోనూ, ఈ జనరేషన్ పాత్రలోనూ.. శ్రద్ధా కపూరే కనిపిస్తుందన్నమాట. మరి ముంబాయ్ నుంచి అంతంత డబ్బులిచ్చి తెచ్చుకుంది దేనికంట. ఆ మాత్రం వాడకపోతే ఎలా? ఏమంటారు? 2018లో ఈ చిత్రం విడుదల అవుతుందని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



