మహేష్ కోసం కథపై రాజమౌళి కసరత్తులు
on Jul 9, 2020
కరోనా బ్రేక్ తరవాత జూన్‌లో 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ మళ్లీ పునఃప్రారంభించాలని అనుకున్నారు. తక్కువ మందితో ఎలా షూటింగ్ చేయవచ్చో చూపించడానికి రాజమౌళి మాక్ షూట్ చేయడానికి ముందుకు వచ్చారు. అయితే... హైదరాబాద్ సిటీ, సరౌండింగ్స్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ట్రయల్ షూట్ చేయలేదు. ప్రజెంట్ దొరికిన ఈ ఫ్రీ టైమ్‌ను మహేష్ బాబుతో చేయనున్న సినిమా స్టోరీ సిట్టింగ్స్ కోసం ఫుల్లుగా వాడుకుంటున్నారట.
ప్రజెంట్ మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ మీద రాజమౌళి ఫుల్ కాన్సంట్రేట్ చేశారని ఫిలింనగర్ టాక్. లాక్డౌన్ స్టార్టింగ్‌లో సూపర్‌స్టార్ మహేష్‌తో సినిమా స్టోరీ కోసం కొన్ని ఐడియాలు అనుకున్నామని, అయితే అవి మహేష్‌కి చెప్పలేదని రాజమౌళి అన్నారు. ముందు కొంత డెవలప్ చేసుకుని తరవాత హీరోకి చెప్పాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పనిలో ఉన్నారట. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్'కి తీసుకున్నట్టు ఎక్కువ సమయం తీసుకోకుండా మహేష్ సినిమాను త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారట.
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కెఎల్ నారాయణ నిర్మించనున్నారు. గతంలో భారీ సినిమాలు నిర్మించిన ఆయన, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'రాఖి' తరవాత మరో సినిమా చేయలేదు. కొంత విరామం తరవాత మహేష్ సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నారు.