ENGLISH | TELUGU  

ఆ విషయంలో తగ్గేదేలే.. దటీజ్ రుక్మిణి వసంత్ 

on Jun 30, 2025

సప్త సాగరాలు ధాటి సైడ్ ఏ, సైడ్ బి చిత్రాల్లో 'ప్రియ' అనే క్యారక్టర్ లో అద్బుతంగా నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న కన్నడ హీరోయిన్ 'రుక్మిణి వసంత్'(Rukmini Vasanth). ఆ తర్వాత బఘిర, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, ఏసిఈ  వంటి చిత్రాల్లో నటించింది. ఆ మూడు చిత్రాల రిజల్ట్ తో సంబంధం లేకుండానే రుక్మిణి పెర్ఫార్మెన్సు కి మంచి పేరు రావడంతో, పలు భాషల్లో వరుస ఆఫర్స్ రుక్మిణి కి క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శివకార్తికేయన్, మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న'మద్రాసి'(Madrasi)అనే చిత్రంలో   చేస్తుంది.

దీంతో పాటు మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr),ప్రశాంత్ నీల్(Prashanth Neel)కాంబోలో తెరకెక్కుతున్నపాన్ ఇండియా మూవీలో కూడా రుక్మిణి నే హీరోయిన్. మేకర్స్ ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించకపోయినా, ఇప్పటికే రుక్మిణి పై కొన్నికీలక సన్నివేశాలని చిత్రీకరించారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతుంది. ఈ మూవీకి సంబంధించి రుక్మిణి కోటిన్నర వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి ఆమె తెలుగులో ఎక్కువ చిత్రాల్లో నటించలేదు. నిఖిల్ తో చేసిన' అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీలో చేసినా, ఆ మూవీ ఎప్పుడు వచ్చిందో కూడా ప్రేక్షకులకి  తెలియని పరిస్థితి. అలాంటిది ఎన్టీఆర్ మూవీలో అవకాశం అంటే ఈ హీరోయిన్ అయినా రెమ్యునరేషన్ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా, నటించడానికి ఒప్పుకుంటుంది. కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటు కోటిన్నర తీసుకుందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతుంది. మేకర్స్ కూడా ఆమె అడిగినంత ఇవ్వడం రుక్మిణి ఉన్న క్రేజ్ కి ఉదాహరణ అని చెప్పవచ్చు.

ఇక ఈ మూవీకి'డ్రాగన్' అనే పేరు పరిశీలనలో ఉండగా మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చాలా కాలం గ్యాప్ తర్వాత  ఎన్టీఆర్  డాన్స్ కి  ఉన్న క్రేజ్ దృష్ట్యా ఒక ప్రత్యేక గీతాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సాంగ్ లో ప్రముఖ హీరోయిన్లు రష్మిక, కేతిక శర్మ పేర్లని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. 2026 జూన్ 25 న ఈ క్రేజీ ప్రాజెక్జ్ విడుదల కానుంది.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.