పవన్‌కి దమ్ము లేదు, చిరు బెటర్
on Mar 27, 2017

చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టి ఊహించిన సీట్లు గెలవలేకపోవడంతో కాంగ్రెస్ లో కలిపేశారు. ప్రజా రాజ్యం పార్టీ లో కీలక వ్యక్తి గా ఉన్న పవన్ కళ్యాణ్, అన్న నిర్ణయం నచ్చక బయటకి వచ్చాడు. ఇంకా చెప్పాలి అంటే, పవన్ అప్పటి నుండి చిరు కి దూరంగానే ఉంటున్నాడు. అయితే, సినిమాలు మరియు రాజకీయాల్లో ఎవరు గొప్ప అనే విషయంలో ఎవరికి వారు భిన్నాభిప్రాయాలు చెబుతున్నారు. కానీ, వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మాత్రం పవన్ కన్నా చిరంజీవి అన్ని విషయాల్లో చాలా బెటర్ అనే అభిప్రాయం వెలిబుచ్చారు.
పవర్ లో ఉన్న వాళ్ళని ప్రజల సమస్యల విషయంలో ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇంట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ భజన చేయడానికే సరిపోయారు, అని అన్నారు. పార్టీ పెట్టి ఇన్ని ఏళ్ళవుతుంది కానీ ఇంత వరకు ఏ ఎలెక్షన్ల లోను పోటీ చేయలేదు. అసలు, ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదు అని సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కన్నా చిరు అన్ని విషయాల్లో బెటర్ అని తన అభిప్రాయం చెప్పారు. చిరంజీవి ని సినిమాల్లో కొట్టేవాళ్ళు లేరు. ఆయన పార్టీ పెట్టి కనీసం కొన్ని సీట్లు గెలవగలిగారు. పవన్ మాత్రం రాజకీయాల్లో నెగ్గడం చాలా కష్టం అని చెప్పుకొచ్చారు. ఇంతకీ, రోజా ఉద్దేశ్యం చిరు ని పొగడడమా, లేక వైస్సార్సీపీ కి తల నొప్పిగా మారిన పవన్ ని తిట్టడమా!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



