100 మంది హీరోయిన్లు ఒక్క అనసూయతో సమానం
on Oct 19, 2024

యాంకర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన అనసూయ(anasuya)ఆ తర్వాత క్షణం, చావు కబురు చల్లగా, ఖిలాడీ,మైకేల్, రజాకార్, విమానం, పెద్ద కాపు వంటి చిత్రాల్లో మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రలు పోషించింది.ముఖ్యంగా రంగస్థలం, పుష్ప పార్ట్ 1 తో అయితే స్టార్ నటిగా ఎదిగిందని కూడా చెప్పవచ్చు.ప్రస్తుతం పుష్ప 2 తో మరో సారి తన సత్తా చాటడానికి సిద్దమవుతుంది.
రీసెంట్ గా జబర్దస్త్ రాకేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కేసిఆర్ అలియాస్ కేశవ చంద్ర రమావత్ మూవీ ట్రైలర్ లాంచ్ జరిగింది.అనసూయ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో సినిమాకి సంబంధించిన ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంది.ఈ ఈవెంట్ లో అనసూయ ని ఉద్దేశించి రాకేష్(raking rakesh)మాట్లాడుతు అనసూయ నాకు అమ్మ వంటిది. సౌమ్యం, ఉదారత, ఔన్నత్యం ఆమె సొంతం.నన్ను సున్నా నుంచి చూసిన వ్యక్తి.నేను ధనరాజ్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నప్పటి దగ్గర నుంచి, జబర్దస్ ఎంట్రీ,నిమా ఎంట్రీ దాకా నా వెనకే ఉండి మంచి చెడ్డలు చెప్తూ దైర్యంగా ఉంది.

పుష్ప 2 తో ఇంకో లెవల్ కి వెళ్లనుంది. అనసూయమ్మ నా ఫంక్షన్ కి రావడం వంద మంది హీరోయిన్లు ఒకే స్టేజ్ మీద ఉన్నంత సమానం అని చెప్పాడు.ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా నిలిచాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



