ఐరన్ లెగ్, గోల్డెన్ లెగ్ ఎవరో చెప్తారా!
on Jun 5, 2025

2016 వ సంవత్సరంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)హీరోగా వచ్చిన 'పెళ్లి చూపులు' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రీతు వర్మ(Ritu Varma). ప్రేమ ఇష్క్ కాదల్, నా రాకుమారుడు, కేశవ, టక్ జగదీష్, వరుడు కావలెను, మజాకా వంటి విభిన్న చిత్రాలు తన ఖాతాలో ఉన్నాయి. తమిళ భాషలో కూడా రెండు చిత్రాల్లో నటించి తన సత్తా చాటింది. ఈ నెల 6 న జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న 'దేవిక అండ్ డానీ'(Devika and danny)అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో భాగంగా రీతు వర్మ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే ఒక సినిమా రూపొందుతుంది. కానీ సినిమా ప్లాప్ అయితే చాలా సార్లు అందులో నటించిన హీరో, హీరోయిన్స్ ని నిందిస్తారు. గోల్డెన్ లెగ్ , ఐరెన్ లెగ్ అనే ట్యాగ్స్ ఇస్తుంటారు. ఒక వేళ సినిమా హిట్ అయినా అది అదృష్టానికి సంబంధించిన విషయం. చేసే ప్రతి సినిమా విజయవంతం కావాలని, ప్రొడ్యూసర్ కి లాభాలు రావాలని అనుకుంటాను. కానీ ఆ విధంగా జరగనప్పుడు బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు అలాంటి వారి గురించి పట్టించుకోకుండా తర్వాత చెయ్యబోయే సినిమా గురించి ఆలోచిస్తున్నాను. విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకులని అలరించాలనేదే నా ప్రధాన లక్ష్యం. దేవిక అండ్ డానీ లో నా క్యారక్టర్ సహజంగా ఉండి ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుందని చెప్పుకొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



